BREAKING
సర్పంచ్ అభ్యర్థి కేతిరెడ్డి కూర్మినాయుడు విస్తృత ప్రచారం బాలికల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఉత్కంఠ ...ఏకగ్రీవం… వెంకంపేట, సూడిగాం పంచాయతీలు తోటపల్లి క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం సర్పంచ్ ఎన్నికలకు తొలిరోజు 34 నామినేషన్లు దాఖలు జిల్లా పరిషత్ చైర్మన్ నిమ్మల నీలిమకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర రావుపల్లిలో కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా భజన కార్యక్రమం పెదమరికి సర్పంచ్‌గా చినమరికి గ్రామానికి చెందిన మైసర్ల నాగమణి ఏకగ్రీవ ఎన్నిక పార్వతీపురం మున్సిపాలిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్ల ఎంపిపి గా బాధ్యతలు స్వీకరించిన యోగిత ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న సాంబన్నవలస మాదక ద్రవ్యాలు వాడకం వల్ల యువతకు అనేక రుగ్మతలు కొనితెచ్చుకుంటున్నారు... . ఎంపీపీ నారాయణస్వామి, సర్పంచ్ వాసవికుమారిలకు ఘన సన్మానం విజ్ఞాన పరిషత్ అభివృద్ధికి కసిరెడ్డి ప్యానెల్‌ను గెలిపించాలి - మానకొండూర్ మండలంలోని పలు గ్రామాల్లో ముమ్మర ఎన్నికల ప్రచారం ఒకే కుటుంబo చేతికి మండల,గ్రామ పంచాయతీ పగ్గాలు

ఎంపీపీ నారాయణస్వామి, సర్పంచ్ వాసవికుమారిలకు ఘన సన్మానం

Select Suryaa Now
ఎంపీపీ నారాయణస్వామి, సర్పంచ్ వాసవికుమారిలకు ఘన సన్మానం
  • ఉల్లిభద్ర ఎస్ సి కాలనీ మహిళల ఆత్మీయ సత్కారం
  • ప్రజాసేవలో ముందుండి గ్రామాలను అభివృద్ధి చేస్తాo
  • ఎంపీపీ మరడాన నారాయణ స్వామి,సర్పంచ్ వాసవికుమారి

గరుగుబిల్లి, సూర్య: మండల పరిషత్ అధ్యక్షులుగా (ఎంపీపీ) బాధ్యతలు స్వీకరించిన మరడాన నారాయణస్వామి,గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన మరడాన వాసవికుమారిలను ఉల్లిభద్ర ఎస్సీ కాలనీకి చెందిన మహిళలు ఘనంగా సత్కరించారు.ఎంపీపీగా మరడాన నారాయణస్వామి,ఏకగ్రీవ సర్పంచిగా మరడాన వాసవికుమారి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో కాలనీ మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి పూలమాలలు వేసి,శాలువలతో ఘనంగా సన్మానం చేశారు.ఈసంద ర్భంగా మహిళలు మాట్లాడుతూ, తమ కాలనీ అభివృద్ధికి మరియు స్థానిక సమస్యల పరిష్కా రానికి నూతన ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు.సన్మాన కార్యక్రమం అనంతరం ఎంపీపీ మరడాన నారాయణస్వామి, సర్పంచ్ మరడాన వాసవికుమారిలు మాట్లాడుతూ తమపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మరియు ఇంతటి ఆదరణ చూపినందుకు కాలనీ వాసులకు, మహిళలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందేలా చూస్తామని, ఎస్సీ కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.
ఈకార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరడాన వెంకటనాయు డు, బోనేల వెంకటి,కాలనీ పెద్దలు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.