telangana
ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి:ఎంపీడీవో ఉషనప్ప
దౌల్తాబాద్, మేజర్ న్యూస్:మండలంలోని చెల్లాపూర్ గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను ఎంపీడీవో ఉషనప్ప పరిశీలించి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.భూమి ఉన్నా లేకపోయినా తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు చెందిన అర్హులైన కుటుంబ యజమానులకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. కుటుంబ యజమాని ప్రమాదవశాత్తు మరణించిన సందర్భంలో బీమా ద్వారా కుటుంబానికి ఆర్థిక భరోసా లభించేలా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని వివరించారు. అర్హత కలిగిన కుటుంబ యజమానులు తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకొని పథకంలో భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఉషనప్ప, పంచాయతీ కార్యదర్శి వెంకటేష్, సూర్య విలేకరి శ్యామ్ సుందర్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.