telangana
నూతనకల్ లో ఉచిత వైద్య శిబిరం.. గ్రామస్తులకు వైద్య సేవలు
మేడ్చల్, మేజర్ న్యూస్:ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని నూతనకల్ వార్డులో సంప్రద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో 16వ వార్డు కౌన్సిలర్ సద్ది సురేష్ రెడ్డి, 21వ వార్డు కౌన్సిలర్ చిన్నోళ్ల భాస్కర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ శిబిరంలో గ్రామస్తులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సలహాలు, సేవలు అందించారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య సేవలను వినియోగించుకున్నారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలను చేరువ చేయాలనే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని గ్రామస్తులు పేర్కొన్నారు. తమ గ్రామంలో ఉచితంగా వైద్య శిబిరాన్ని నిర్వహించి సేవలు అందించిన సంప్రద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యానికి, కార్యక్రమానికి కృషి చేసిన కౌన్సిలర్లు సద్ది సురేష్ రెడ్డి, చిన్నోళ్ల భాస్కర్‌కు గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.