బక్కుపేట సర్పంచ్‌గా దీసరి సింహాచలంఏకగ్రీవ ఎన్నిక
- గ్రామాభివృద్ధి కోసం ఏకగ్రీవానికి ముందుకొచ్చిన గ్రామస్తులకు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అభినందనలు
సీతానగరం, సూర్య: మండలం బక్కుపేట గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా దీసరి సింహాచలం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు.పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యే గ్రామ పంచాయతీలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రోత్సాహక నజరానా ప్రకటించిన నేపథ్యంలో, గ్రామాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని బొక్కుపేట గ్రామస్తులు ఏకగ్రీవ ఎన్నికకు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ పలు కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. గ్రామస్తులంతా ఐక్యంగా ఉండి, రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ దీసరీ సింహాచలంనుఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రౌతు వేణుగోపాల్ నాయుడు. ఆర్ వెంకంపేట సెగ్మెంట్ ఎంపీటీసీ గొట్టాపు అప్పారావు పాల్గొన్నారు.