BREAKING
పెదమరికి సర్పంచ్‌గా చినమరికి గ్రామానికి చెందిన మైసర్ల నాగమణి ఏకగ్రీవ ఎన్నిక పార్వతీపురం మున్సిపాలిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్ల ఎంపిపి గా బాధ్యతలు స్వీకరించిన యోగిత ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న సాంబన్నవలస మాదక ద్రవ్యాలు వాడకం వల్ల యువతకు అనేక రుగ్మతలు కొనితెచ్చుకుంటున్నారు... . ఎంపీపీ నారాయణస్వామి, సర్పంచ్ వాసవికుమారిలకు ఘన సన్మానం విజ్ఞాన పరిషత్ అభివృద్ధికి కసిరెడ్డి ప్యానెల్‌ను గెలిపించాలి - మానకొండూర్ మండలంలోని పలు గ్రామాల్లో ముమ్మర ఎన్నికల ప్రచారం ఒకే కుటుంబo చేతికి మండల,గ్రామ పంచాయతీ పగ్గాలు బక్కుపేట సర్పంచ్‌గా దీసరి సింహాచలంఏకగ్రీవ ఎన్నిక విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత లక్ష్యాలను సాధించాలి: సీఐ కిరణ్ ఆరు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ అమలు చేయాలి.. ఆర్డీఎంఏకు రాష్ట్ర సంఘ నాయకుల వినతి.. తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి.. ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలి:ఘట్‌కేసర్ సీఐ పి. కిరణ్ కీసర డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా కొమ్ము చిరంజీవి నూతనకల్ లో ఉచిత వైద్య శిబిరం.. గ్రామస్తులకు వైద్య సేవలు రోడ్డుపైకి దూసుకొచ్చిన ఇంటి స్లాబ్‌.. అక్రమ నిర్మాణంపై స్థానికుల ఆగ్రహం.. కాలువను దాటి రోడ్డు వైపు నిర్మాణం.. అధికారులు స్పందించి తొలగించాలని ఫిర్యాదు..

డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి.. ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలి:ఘట్‌కేసర్ సీఐ పి. కిరణ్

Select Suryaa Now
డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి.. ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలి:ఘట్‌కేసర్ సీఐ పి. కిరణ్
ఘట్‌కేసర్, మేజర్ న్యూస్:మాదకద్రవ్యాల వినియోగం యువత జీవితాలను నాశనం చేయడమే కాకుండా వారి భవిష్యత్తును అంధకారంలోకి నెడుతుందని ఘట్‌కేసర్ సీఐ పి. కిరణ్ అన్నారు. డ్రగ్స్‌కు అలవాటు పడకుండా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఘట్‌కేసర్ పోలీసుల ఆధ్వర్యంలో ఔషాపూర్‌లోని ఆల్ఫోర్స్ కళాశాలలో శనివారం యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ పి. కిరణ్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడటంతో పాటు విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం దెబ్బతింటాయని తెలిపారు. తోటి వారి ఒత్తిడికి, చెడు స్నేహాలకు లోనై డ్రగ్స్‌కు బానిసలు కావద్దని విద్యార్థులకు సూచించారు. డ్రగ్స్‌కు సంబంధించిన కార్యకలాపాలు ఎక్కడైనా గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. యువత దేశ భవిష్యత్తుకు పునాదులని, వారు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ లక్ష్యసాధన దిశగా ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో 'యాంటీ డ్రగ్ సోల్జర్స్' ప్రతిజ్ఞ చేయించి, మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సై హీన, కానిస్టేబుల్ లు పాల్గొన్నారు.