telangana
రైతుల కష్టాలకు చెక్.. మైల్వార్‌లో నూతన మోరం రోడ్డు పనులు ప్రారంభం
బషీరాబాద్, మేజర్ న్యూస్:బషీరాబాద్ మండల పరిధిలోని మైల్వార్ గ్రామంలో రైతుల రాకపోకలకు ఇబ్బందులు తొలగించే దిశగా నూతన మోరం రహదారి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గ్రామంలోని టవర్ ప్రాంతం నుంచి వ్యవసాయ భూములకు వెళ్లే మార్గంలో చేపట్టిన ఈ పనులను బషీరాబాద్ మాజీ వైస్ ఎంపీపీ అబ్దుల్ ఖాలిద్ ప్రారంభించారు.ఇన్నాళ్లుగా సరైన రహదారి సౌకర్యం లేక రైతులు వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లేందుకు, పండించిన పంటలను తరలించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నూతన రహదారి నిర్మాణంతో రైతులకు రాకపోకలు సులభతరం కావడంతో పాటు వ్యవసాయ పనులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. సర్పంచ్ సీమా సుల్తానా, ఉపసర్పంచ్ తమన్న ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ పనులు గ్రామ అభివృద్ధికి దోహదపడతాయని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.