telangana
కస్లాబాద్‌లో ఇందిరమ్మ జీవిత బీమా పథకం ప్రారంభం
మోమిన్‌పేట్, మేజర్ న్యూస్:మోమిన్‌పేట్ మండల పరిధిలోని కస్లాబాద్ గ్రామపంచాయతీలో శనివారం ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని స్థానిక సర్పంచ్ సండ్ర మధురవేణి మోహన్ గ్రామస్తులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యదర్శి శిల్ప లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో అమలు చేస్తున్న ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పథకంపై అర్హులైన ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, అర్హత ఉన్నవారు తప్పనిసరిగా పథకంలో భాగస్వాములు కావాలని సూచించారు. ప్రజల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ పుణ్యమ్మ, వార్డు సభ్యులు, గ్రామస్తులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.