BREAKING
సర్పంచ్ అభ్యర్థి కేతిరెడ్డి కూర్మినాయుడు విస్తృత ప్రచారం బాలికల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఉత్కంఠ ...ఏకగ్రీవం… వెంకంపేట, సూడిగాం పంచాయతీలు తోటపల్లి క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం సర్పంచ్ ఎన్నికలకు తొలిరోజు 34 నామినేషన్లు దాఖలు జిల్లా పరిషత్ చైర్మన్ నిమ్మల నీలిమకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర రావుపల్లిలో కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా భజన కార్యక్రమం పెదమరికి సర్పంచ్‌గా చినమరికి గ్రామానికి చెందిన మైసర్ల నాగమణి ఏకగ్రీవ ఎన్నిక పార్వతీపురం మున్సిపాలిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్ల ఎంపిపి గా బాధ్యతలు స్వీకరించిన యోగిత ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న సాంబన్నవలస మాదక ద్రవ్యాలు వాడకం వల్ల యువతకు అనేక రుగ్మతలు కొనితెచ్చుకుంటున్నారు... . ఎంపీపీ నారాయణస్వామి, సర్పంచ్ వాసవికుమారిలకు ఘన సన్మానం విజ్ఞాన పరిషత్ అభివృద్ధికి కసిరెడ్డి ప్యానెల్‌ను గెలిపించాలి - మానకొండూర్ మండలంలోని పలు గ్రామాల్లో ముమ్మర ఎన్నికల ప్రచారం ఒకే కుటుంబo చేతికి మండల,గ్రామ పంచాయతీ పగ్గాలు

ఆరు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ అమలు చేయాలి.. ఆర్డీఎంఏకు రాష్ట్ర సంఘ నాయకుల వినతి.. తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ

Select Suryaa Now
ఆరు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ అమలు చేయాలి..  ఆర్డీఎంఏకు రాష్ట్ర సంఘ నాయకుల వినతి..   తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ

(అనంతపురం కార్పొరేషన్ మేజర్ న్యూస్..)

ఆరు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన ప్రతి వార్డు సచివాలయ ఉద్యోగికి ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ ఏఏఎస్ తక్షణమే అమలు చేయాలని రాయలసీమ ప్రాంతీయ పురపాలక పరిపాలన సంచాలకుడు నాగరాజుకు రాష్ట్ర సంఘ నాయకులు విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు అనంతపురంలో రాయలసీమ ప్రాంతీయ పురపాలక పరిపాలన సంచాలకుడిని ఏపీ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఏపీ ప్రభుత్వ వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆరు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులకు అమలు చేయాల్సిన ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ విషయంలో అనవసర జాప్యం జరుగుతోందని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఉద్యోగికి ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే ఏఏఎస్ ప్రయోజనాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై ప్రాంతీయ పురపాలక పరిపాలన సంచాలకుడు నాగరాజు స్పందిస్తూ, తన పరిధిలో ఉన్న ఐదు మున్సిపల్ కార్పొరేషన్లు, 37 మున్సిపాలిటీలలో ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ అమలు విషయంపై తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు డి. సుధాకర్, వి. లక్ష్మీనారాయణ, ఎం.కె. వరప్రసాద్, అనంతపురం జిల్లా నాయకులు మల్లికార్జున, సి. రామచంద్ర, చిన్నూరప్ప, శివశంకర్, రామకృష్ణ, మహేష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.