|
|
by Suryaa Desk | Mon, Sep 15, 2025, 07:13 PM
భాగ్యనగరంలో నాలాల ఆక్రమణల కారణంగా వరదలు సంభవించి ప్రమాదాలు జరుగుతున్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆదివారం రాత్రి అఫ్జల్ సాగర్‌లో ఇద్దరు వ్యక్తులు గల్లంతైనట్లు ఆయన వెల్లడించారు. నాలాల ఆక్రమణల వల్లే ఇటువంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అక్రమ నిర్మాణాల కారణంగా అఫ్జల్ సాగర్ ప్రాంతంలో కొన్ని ఇళ్లను తొలగించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. నిన్న ముగ్గురు గల్లంతవ్వగా, అందులో ఇద్దరు మరణించినట్లు ఆయన పేర్కొన్నారు. నగరంలోని సమస్యల పరిష్కారానికి హైడ్రా సంస్థ నిరంతరం కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.