ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Mon, Sep 15, 2025, 01:46 PM
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. చింత్రియాల బల్లకట్టు సమీపంలో గేదెలు మేపడానికి వెళ్లిన బడుగుల సైదమ్మ (54) అనే మహిళ కృష్ణా నదిలో ప్రమాదవశాత్తు పడి గల్లంతయ్యింది. సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా, నది ఒడ్డున ఆమె చెప్పులు కనిపించాయి. దీంతో ఆమె నదిలో పడిపోయిందని అనుమానించి, గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.