|
|
by Suryaa Desk | Wed, Jul 02, 2025, 03:02 PM
TG: పేదలకే తొలివిడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తాజాగా వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశామని పేర్కొన్నారు. బుధవారం ఆయన ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. ముందుగా పూరి గుడిసెలో ఉన్నవారికే మొదటి ప్రాధాన్యత అని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ చేరాలన్నారు.