![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 27, 2025, 11:31 AM
అమీన్పూర్ : అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామంలో మన్నే శివ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన చికెన్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శుక్రవారం మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ తుమ్మల పాండురంగారెడ్డి గారు పాల్గొన్నారు. నేటి తరం యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి వైపు అడుగులు వేయడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, యాదగిరి యాదవ్, రాజు, తదితరులు పాల్గొన్నారు.