|
|
by Suryaa Desk | Sat, May 24, 2025, 02:49 PM
అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలోని పెద్దిరెడ్డిగూడెం, భీమునిగూడెం, గుంపెన, మర్రిగూడెం, అబ్బుగూడెం గ్రామాల్లో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శనివారం పర్యటించారు. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరీ పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం గుంపెన సహకార పరపతి సంఘంలో రైతులకు పచ్చి రొట్ట విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే వెంట తహసీల్దార్ పుల్లారావు, ఎంపీడీఓ మహాలక్ష్మి, సొసైటీ చైర్మెన్ ఉన్నారు.