|
|
by Suryaa Desk | Sat, May 24, 2025, 02:43 PM
తెలంగాణ పర్యావరణ పరిరక్షణ దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసిందని బీజేపీ రాష్ట్ర నేత, ప్రముఖ జపాన్ శాస్త్రవేత్త డాక్టర్ పైడి ఎల్లారెడ్డి తెలిపారు. ఎల్లారెడ్డి సెగ్మెంట్‌కు చెందిన ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ, పీఎంఈ డ్రైవ్ (ప్రధాన్ మంత్రి ఇ-బసెస్ స్కీమ్) కింద హైదరాబాద్‌కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు చేయడం ఎంతో సంతోషకరమైన విషయం అని అన్నారు.
ఎలక్ట్రిక్ బస్సులు వాతావరణ శుద్ధికి ఎంతో మేలు చేస్తాయని, ఇవి ప్రాకృతిక వనరులను కాపాడటంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని డాక్టర్ ఎల్లారెడ్డి తెలిపారు. ఈ చర్య ద్వారా నగరంలో కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు పెద్ద పుష్కరంగా మారనుందని అభిప్రాయపడ్డారు.
భారతదేశ అభివృద్ధి బిజెపి నాయకత్వంలోనే సాధ్యమని పేర్కొంటూ, కేంద్రం తీసుకుంటున్న అనేక పర్యావరణ అనుకూల చర్యలు దేశ భవిష్యత్తుకు మేలుకావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.