![]() |
![]() |
by Suryaa Desk | Wed, May 21, 2025, 05:56 PM
కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యవహారంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలి, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. ఇది కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి ఆడుతున్న రాజకీయ నాటకమని సంచలన ఆరోపణలు చేశారు.దిక్కుతోచని స్థితిలోనే కేసీఆర్కు నోటీసులు ఇచ్చారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. గత 17 నెలలుగా పరిపాలనలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాపాలన కనుమరుగై, కమీషన్ల రాజ్యం నడుస్తోందని విరుచుకుపడ్డారు. "కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులే స్వయంగా కమీషన్లు లేనిదే పనులు జరగడం లేదని చెబుతున్నారు. దీనిని బట్టి రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు" అని కేటీఆర్ పేర్కొన్నారు.