|
|
by Suryaa Desk | Tue, May 20, 2025, 12:34 PM
నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలంలో దారుణం జరిగింది. ఓ మహిళ భర్తను, కుతురిని హతమార్చింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. ఎల్లమ్మకు ముగ్గురు పిల్లలు. వీరిలో నవనీత (6) అనే బాలిక కనిపించకపోయేసరికి బాలిక బాబాయ్ ఊరిలో వెతుకుతుండగా.. నీటి సంపులో కనిపించింది. బాలికను బయటకు తీయగా.. అప్పటికే మరణించినట్లు తెలిసింది. తానే బాలికను సంపులో పడేసినట్లు ఎల్లమ్మ ఒప్పుకుంది. ఇక ఐదు నెలల క్రితం భర్తను కూడా గొడ్డలితో నరికి చంపినట్లు గ్రామస్తులు తెలిపారు.