|
|
by Suryaa Desk | Tue, May 20, 2025, 12:31 PM
రాజ్‌భవన్‌లో జరిగిన చోరీ ఘటనపై పంజాగుట్ట పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. 'శ్రీనివాస్ అనే ఉద్యోగి, ఓ మహిళా ఉద్యోగి ఫొటోలను మార్ఫింగ్ చేశాడు. ఆ కేసులో శ్రీనివాస్ ను అరెస్ట్ చేసి, రిమాండ్ కు పంపాం. ప్రభుత్వం సస్పెండ్ చేసింది. బెయిల్ పై బయటకొచ్చాక హెల్మెట్ పెట్టుకొని రాజ్‌భవన్‌లోకి వచ్చాడు. తాను వాడిన సిస్టమ్లోని మహిళ మార్ఫింగ్ ఫొటోలు ఉన్న హార్డ్ డిస్క్ ను తీసుకుని వెళ్లాడు' అని వివరించారు.