|
|
by Suryaa Desk | Fri, May 16, 2025, 08:27 PM
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం దాతరపల్లి గ్రామంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలలో ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలయ ఆవరణంలో నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొన్నారు.ముందుగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనం చేయగా,కార్య నిర్వహుకులు ప్రసాదం అందజేసారు.