|
|
by Suryaa Desk | Tue, May 13, 2025, 07:55 PM
సనాతన ధర్మం పేరుతో పరిచయం చేసుకున్న అఘోరి.. తనకు కొండగట్టులో తాళి కట్టి అత్యాచారయత్నం చేసినట్లు కరీంనగర్ కొత్తపెళ్లికి చెందిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను బెదిరించి రూ.3 లక్షలు తీసుకున్నట్లు తెలిపింది.ఈ విషయాన్ని బయటపెడితే చంపేస్తానంటూ బెదిరించిందని పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు అఘోరీపై 64(1), 87 318(4) 351(2) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్థిక మోసం కేసులో ఇప్పటికే పోలీసుల రిమాండ్‌లో ఉన్న అఘోరిని ఈ కేసుకు సంబంధించి కూడా విచారించే అవకాశముంది అంటున్నారు.హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ ఇటీవల అఘోరిపై మోకిలా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాంత్రిక పూజల పేరుతో తన వద్ద రూ.9.5 లక్షలు తీసుకొని మోసం చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో రంగంలోకి దిగిన మోకీలా పోలీసులు.. అఘోరిని అరెస్ట్ చేశారు