|
|
by Suryaa Desk | Fri, Jan 09, 2026, 11:35 PM
తమిళ సినిమా “Tourist Family” అరుదైన ఘనత సాధించింది. ఇది ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్స్ పోటీలలో ఎంపికైంది. ఈ చిత్రం బెస్ట్ పిక్చర్ కేటగిరీలో పోటీ పడనుంది.సినిమాలో హీరోయిన్ సిమ్రాన్ ఆకట్టుకున్నారు. ఆస్కార్ అకాడమీ ఈ నెల 22న తుది ఎంపిక జాబితాను అధికారికంగా ప్రకటనుంది.ఈ ఏడాది ఆస్కార్ రేసులో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన రెండు చిత్రాలు కూడా చోటు దక్కించుకున్నాయి. “Kantara: Chapter-1” మరియు “Mahavatar Narsimha” జనరల్ ఎంట్రీలో ఉన్న ఈ చిత్రాలు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, స్క్రీన్‌ప్లే, ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ వంటి ప్రధాన కేటగిరీల్లో పోటీ పడతాయి. హోంబలే ఫిల్మ్స్ ఈ విషయాన్ని అధికారిక సోషల్ మీడియా పోస్టు ద్వారా వెల్లడించింది.ఈ ఏడాది 98వ ఆస్కార్ అవార్డుల వేడుక 2026 మార్చి 15న లాస్ ఏంజెలెస్‌లోని డాల్బీ థియేటర్లో జరగనుంది. 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు విడుదలైన సినిమాలే ఈ ఏడాదీ ఎన్నికలో పరిగణలోకి తీసుకుంటారు.మొత్తంగా, భారత్ నుంచి ఐదు సినిమాలు ఆస్కార్ బరిలో నిలిచాయి. “Tourist Family” తో పాటు “Tanvi the Great”, “Sister Midnight” వంటి చిత్రాలు కూడా ఎంపిక అయ్యాయి.
Latest News