|
|
by Suryaa Desk | Tue, Sep 30, 2025, 05:30 PM
గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి, 'జూనియర్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తెలుగు .. కన్నడ భాషల్లో ఈ సినిమాను రూపొందించారు. సాయి కొర్రపాటి నిర్మించిన ఈ సినిమాకి రాధాకృష్ణ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది జులై 18వ తేదీన థియేటర్లకు వచ్చింది. శ్రీలీల కథానాయికగా నటించిన ఈ సినిమాను, 25 కోట్ల బడ్జెట్ లో నిర్మించగా, 16 కోట్లను మాత్రమే రాబట్టింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైపోయింది. ఈ సినిమా ఈ రోజు నుంచి 'ఆహా'లోను .. అమెజాన్ ప్రైమ్ లోను స్ట్రీమింగ్ అవుతోంది.
Latest News