|
|
by Suryaa Desk | Tue, Sep 30, 2025, 04:31 PM
రెండు దశాబ్దాల తర్వాత మోహన్‌లాల్ మరియు మమ్ముట్టి కలిసి ఒక చిత్రం కోసం పనిచేస్తున్నారు. మాలీవుడ్ అభిమానులకు ఇది ఒక చారిత్రాత్మక క్షణం. ఈ భారీ అంచనాల ప్రాజెక్ట్ లో ఈ ఇద్దరు లెజెండ్స్ మాత్రమే కాకుండా ఫహద్ ఫాసిల్, కుంచాకో బోబన్ మరియు నయనతార కూడా నటిస్తున్నారు. మహేష్ నారాయణన్ దర్శకత్వం వహించిన ఇది మలయాళ చిత్రసీమలో అతిపెద్ద చిత్రాలలో ఒకటిగా నిలిచింది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ బజ్ ప్రకారం, త్వరలో మమ్ముట్టి ఈ సినిమా షూటింగ్ ని తిరిగి ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి మహేష్ నారాయణన్ రచన అందించారు. రాజేష్ కృష్ణ మరియు సి.వి. సారథి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు. ఈ చిత్రంలో రాంజీ పనికర్, రాజీవ్ మీనన్, డానిష్ హుస్సేన్, షాహీన్ సిద్ధిక్, సనల్ అమన్, రేవతి, దర్శన రాజేంద్రన్, సెరీన్ షిహాబ్ మరియు ప్రకాష్ బెలవాడి కూడా కీలక పాత్రలలో నటిస్తున్నారు. సహ నిర్మాతలు C.R. సలీం మరియు సుభాష్ జార్జ్ మాన్యుయెల్‌తో కలిసి ఆంటో జోసెఫ్ ఈ సినిమాని నిర్మించారు.
Latest News