విద్యాభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి. మహిళల ఆర్థిక సాధికారతకు ప్రాధాన్యత.. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి.
పెద్ద శంకరంపేట్ ; విద్యాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని.. మహిళల ఆర్థిక సాధికారత కల్పనలో అధిక ప్రాధాన్యం కల్పిస్తుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి సంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.. గురువారం పెద్ద శంకరంపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రహరి గోడ ఆరేపల్లి ప్రాథమిక పాఠశాలలో 10 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రహరీ గోడ.. ఊత్తులూరులో 10 లక్షల రూపాయలతో నిర్మించిన మహిళా శక్తి భవనాన్ని వారు ప్రారంభించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి గ్రామాల్లో అభివృద్ధి పనులను దశలవారీగా చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో షాకీర్ అలీ.. ఐకెపి ఎపిఎం శశికళ . ఎంఈఓ శేఖర్. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు నారా గౌడ్. మధు మురళి పంతులు. ఆర్యన్ సంతోష్ కుమార్. దాచా సంగమేశ్వర్. సుభాష్ గౌడ్. మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పెరుమాండ్లు గౌడ్. సర్పంచ్ లు. నాయకులు జంగం రేణుక. రోమల సాయిలు. సుభాష్ రవి. పేట ఉపసర్పంచ్ రాజు గౌడ్ . ప్రిన్సిపల్ శిరీష. శోభారాణి తదితరులు పాల్గొన్నారు..