సైకిల్ గుర్తుకి ఓటు వేయండి
-టిడిపి చైర్ పర్సన్ అభ్యర్థి కూన ప్రమీల
ఆమదాలవలస, నవంబర్ 20, మేజర్ న్యూస్
ఆమదాలవలస మున్సిపాలిటీ 1,2, 21 వార్డుల్లో కూటమి బలపరిచిన టిడిపి చైర్ పర్సన్ అభ్యర్థి కూన ప్రమీల శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీ అందించాలని ఓటర్లను కోరారు. కూటమి ప్రభుత్వ హయాంలో పట్టణ, వార్డులు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని తెలియజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తూ, వార్డుల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలియజేశారు. సిసి రోడ్లు, మురుగు కాలవలు, తాగునీటి సౌకర్యాలు ప్రభుత్వ హయాంలో నిర్మించి ప్రజలకు అభివృద్ధిని అందించామని తెలిపారు. వార్డులో ఎలాంటి సమస్య ఉన్న తక్షణమే పరిష్కరించడం జరుగుతుందని తెలియజేశారు. మరింత అభివృద్ధి చేసేందుకు ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వివిధ వార్డుల్లో కూటమి తరపున పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో రెండో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కూన వెంకట రాజ్యలక్ష్మి, గేదెల సత్యనారాయణ, బుడుమూరు గోవిందరావు, టిడిపి పట్టణ అధ్యక్షుడు సంపద రావు మురళి, బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు కనితి విజయలక్ష్మి, టీడీపీ నాయకులు కూన భానుజీ రావు, తదితరులు పాల్గొన్నారు.