మాడుగుల జడ్పీటీసీ సభ్యునిగా పుప్పాల లక్ష్మి నారాయణ ప్రమాణ స్వీకారం
వి మాడుగుల మండలం మేజర్ న్యూస్ జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం మాడుగుల జడ్పీటీసీ సభ్యునిగా పుప్పాల లక్ష్మి నారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ మూర్తి, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయకుమార్, జడ్పీ సీఈఓ నారాయణరావు తదితరుల సమక్షంలో ఆయన ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమానికి మాడుగుల నుండి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పాల అప్పలరాజు, ఎంపీపీ వంతల రాము, వైస్ ఎంపీపీ ఉండూరు కాసులమ్మ దేముడు, నాయకులు టిడిపి మండల పార్టీ అధ్యక్షులునందారపు సన్యాసి రావు ప్రధాన కార్యదర్శి, పుప్పాల రమేష్, పలువురు ఎంపీటీసీలు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వాహనాల్లో తరలివెళ్లి పుప్పాల లక్ష్మి నారాయణకు శుభాకాంక్షలు తెలిపారు.