BREAKING
ఆనందపురం నూతన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలకు ఎమ్మెల్యే గంటా ఘన సత్కారం బ్రహ్మలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు దంపతులు* ఎస్.రాయవరం మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సోమిరెడ్డి లక్ష్మి నామినేషన్! మాడుగుల జడ్పీటీసీ సభ్యునిగా పుప్పాల లక్ష్మి నారాయణ ప్రమాణ స్వీకారం గోవింద నామస్మరణతో మార్మోగిన ఎస్.రాయవరం! మాకవరపాలెం జడ్పీటీసీగా అల్లు రామనాయుడు ప్రమాణ స్వీకారం క్రీడల్లో పాల్గొనడం వలన మంచి డైరెక్టర్ వ్యాయామం, అభినందించిన ఏ యూ డైరెక్టర్ అఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆచార్య ఎ. పల్లవి పెనుగొల్లులో చలో ఢిల్లీ పోస్టర్ విడుదల! గెడ్డపాలెంలో వైఎస్సార్‌సీపీ సత్తా చాటిన పీవీఆర్! కోనసీమ జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్‌గా గొల్లపల్లి అమూల్య.. హోంమంత్రి అనిత సహకారంతో అభివృద్ధి చేస్తా! కొరుప్రోలు జడ్పీ హైస్కూల్లో ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు! ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద పెద్దేరు జలాశయంలో చేప పిల్లల విడుదల కనకమహాలక్ష్మి మార్గశిర ఉత్సవాలకు శ్రీకారం అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద విద్యుత్ దీపాలు అమర్చాలి

ఆనందపురం నూతన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలకు ఎమ్మెల్యే గంటా ఘన సత్కారం

Select Suryaa Now
ఆనందపురం నూతన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలకు ఎమ్మెల్యే గంటా ఘన సత్కారం

డిసెంబర్ 2 పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి క్లీన్ స్వీప్ చేయాలి : గంటా శ్రీనివాసరావు

ఆనందపురం, మేజర్ న్యూస్ : ఆనందపురం మండల నూతన ఎంపీపీ తాట్రాజు అప్పారావు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీ విజేతలను భీమిలి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శుక్రవారం ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు శాలువాలు కప్పి, పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు. మండలంలో తెలుగుదేశం పార్టీకి, కూటమికి లభించిన ఘన విజయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపై ఉందని అన్నారు. మండలంలోని ప్రతి గ్రామంలోనూ బలమైన ముద్ర వేసేలా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, నాయకులు, కార్యకర్తలు అందరూ సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా డిసెంబర్ 2న జరిగే పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి క్లీన్ స్వీప్ చేసేలా ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పనిచేయాలని సూచించారు.
నూతన ఎంపీపీ తాట్రాజు అప్పారావు మాట్లాడుతూ, తనకు అవకాశం కల్పించిన పార్టీ అధిష్టానానికి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు,తన విజయానికి కృషి చేసిన ఎంపీటీసీలకు,నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆనందపురం మండలాన్ని అభివృద్ధిలో ముందంజలో నిలిపేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.