BREAKING
ఆనందపురం నూతన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలకు ఎమ్మెల్యే గంటా ఘన సత్కారం బ్రహ్మలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు దంపతులు* ఎస్.రాయవరం మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సోమిరెడ్డి లక్ష్మి నామినేషన్! మాడుగుల జడ్పీటీసీ సభ్యునిగా పుప్పాల లక్ష్మి నారాయణ ప్రమాణ స్వీకారం గోవింద నామస్మరణతో మార్మోగిన ఎస్.రాయవరం! మాకవరపాలెం జడ్పీటీసీగా అల్లు రామనాయుడు ప్రమాణ స్వీకారం క్రీడల్లో పాల్గొనడం వలన మంచి డైరెక్టర్ వ్యాయామం, అభినందించిన ఏ యూ డైరెక్టర్ అఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆచార్య ఎ. పల్లవి పెనుగొల్లులో చలో ఢిల్లీ పోస్టర్ విడుదల! గెడ్డపాలెంలో వైఎస్సార్‌సీపీ సత్తా చాటిన పీవీఆర్! కోనసీమ జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్‌గా గొల్లపల్లి అమూల్య.. హోంమంత్రి అనిత సహకారంతో అభివృద్ధి చేస్తా! కొరుప్రోలు జడ్పీ హైస్కూల్లో ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు! ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద పెద్దేరు జలాశయంలో చేప పిల్లల విడుదల కనకమహాలక్ష్మి మార్గశిర ఉత్సవాలకు శ్రీకారం అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద విద్యుత్ దీపాలు అమర్చాలి

పెనుగొల్లులో చలో ఢిల్లీ పోస్టర్ విడుదల!

Select Suryaa Now
పెనుగొల్లులో చలో ఢిల్లీ పోస్టర్ విడుదల!

 

కార్మికులతో వెట్టిచాకిరీ... లేబర్ కోడ్స్ రద్దు చేయాలి

సిఐటియు జిల్లా అధ్యక్షులు వి.వి.శ్రీనివాసరావు

ఎస్.రాయవరం, నవంబర్ 20, మేజర్ న్యూస్: 
డిసెంబర్ 1న జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు వి.వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. పెనుగొల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద 'ఛలో ఢిల్లీ' పోస్టర్ ఆవిష్కరణలో ఆయన మాట్లాడారు.

లేబర్ కోడ్స్ రద్దు, కనీస వేతనాల అమలు, ఉద్యోగ భద్రత, కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు, అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని డిమాండ్ చేశారు. 'ఢిల్లీని ముట్టడిద్దాం' నినాదంతో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.

ఏపీలో కనీస వేతనాల జీవో సవరించి 12 ఏళ్లయినా ప్రభుత్వం స్పందించలేదని, 8 గంటల పనిని 10 గంటలకు పెంచి కార్మికులతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని విమర్శించారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, స్కూల్ ఆయాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మనబాల రాజేష్, ఆశా యూనియన్ నాయకులు మంగవేణి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.