ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద పెద్దేరు జలాశయంలో చేప పిల్లల విడుదల
, నవంబర్ 20 వి మాడుగుల మేజర్ న్యూస్ మండలం, రావిపాలెం గ్రామంలోని పెద్దేరు జలాశయం (రిజర్వాయర్) నందు తేదీ 20-11-2026న బొచ్చు జాతి చేప పిల్లల విడుదల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శ్రీ కూటి కొండమ్మ మత్స్యసహకార సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు, సంఘ నాయకులు పాల్గొని జలాశయంలోకి చేప పిల్లలను వదిలారు.
అనకాపల్లి జిల్లా మత్స్యశాఖ అధికారి (డీఎఫ్‌ఓ) సిద్ధార్థ్ వర్ధన్ గారు మరియు సహాయ సంచాలకులు (ఏడీ) విజయ గారి ఆదేశాల ప్రకారం 2026-27 సంవత్సరానికి గాను 'ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన' (పీఎంఎంఎస్‌వై) పథకంలో భాగంగా 90 శాతం రాయితీ (సబ్సిడీ) పై ఈ బొచ్చు జాతి చేప పిల్లలను జలాశయంలోకి విడుదల చేయడం జరిగింది. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి మరియు మత్స్య సంపద పెంపొందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమంలో గ్రామ మత్స్య సహాయకులు (వీఎఫ్‌ఏ) మంజుల, మత్స్యశాఖ విస్తరణ సహాయకులు (ఎంపీఎఫ్‌ఈఏ) గంగాధర్, శ్రీ కూటి కొండమ్మ మత్స్యసహకార సంఘం అధ్యక్షుడు చెడ్డా వరహాలు దొర, కార్యదర్శి బచ్చల వరహాలు దొర, కటిక మూలయ్య మరియు పాలకవర్గ సభ్యులు, సంఘ సభ్యులు అందరూ హాజరయ్యారు.