BREAKING
ఆనందపురం నూతన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలకు ఎమ్మెల్యే గంటా ఘన సత్కారం బ్రహ్మలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు దంపతులు* ఎస్.రాయవరం మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సోమిరెడ్డి లక్ష్మి నామినేషన్! మాడుగుల జడ్పీటీసీ సభ్యునిగా పుప్పాల లక్ష్మి నారాయణ ప్రమాణ స్వీకారం గోవింద నామస్మరణతో మార్మోగిన ఎస్.రాయవరం! మాకవరపాలెం జడ్పీటీసీగా అల్లు రామనాయుడు ప్రమాణ స్వీకారం క్రీడల్లో పాల్గొనడం వలన మంచి డైరెక్టర్ వ్యాయామం, అభినందించిన ఏ యూ డైరెక్టర్ అఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆచార్య ఎ. పల్లవి పెనుగొల్లులో చలో ఢిల్లీ పోస్టర్ విడుదల! గెడ్డపాలెంలో వైఎస్సార్‌సీపీ సత్తా చాటిన పీవీఆర్! కోనసీమ జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్‌గా గొల్లపల్లి అమూల్య.. హోంమంత్రి అనిత సహకారంతో అభివృద్ధి చేస్తా! కొరుప్రోలు జడ్పీ హైస్కూల్లో ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు! ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద పెద్దేరు జలాశయంలో చేప పిల్లల విడుదల కనకమహాలక్ష్మి మార్గశిర ఉత్సవాలకు శ్రీకారం అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద విద్యుత్ దీపాలు అమర్చాలి

హోంమంత్రి అనిత సహకారంతో అభివృద్ధి చేస్తా!

Select Suryaa Now
హోంమంత్రి అనిత సహకారంతో అభివృద్ధి చేస్తా!

 

ఎస్.రాయవరం జడ్పీటీసీ రమణమ్మ  బాధ్యతల స్వీకరణ

ఎస్.రాయవరం, నవంబర్ 20, మేజర్ న్యూస్:
అనకాపల్లి జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎస్.రాయవరం మండల జడ్పీటీసీ గా తెలుగుదేశం పార్టీ కి చెందిన అమలకంటి రమణమ్మ ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. అధికారులు ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మండలంలోని పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు ఆమెను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా రమణమ్మ మాట్లాడుతూ, మండల అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా మండలంలో వెనుకబడిన ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి, తాగునీటి సౌకర్యం కల్పన, విద్యుత్ సమస్యల పరిష్కారం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల 
వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత సహకారంతో మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు అమలకంటి అబద్దం, తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి ముప్పిన శ్రీనివాసరావు, ఎస్.రాయవరం మండల కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అమలకంటి అభిమానులు పాల్గొన్నారు.