అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద విద్యుత్ దీపాలు అమర్చాలి
నర్సీపట్నం ఆర్డిఓ వీవి రమణ
రావికమతం నవంబర్ 20 మేజర్ న్యూస్ : గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద విద్యుత్ దీపాలు అమర్చాలని నర్సీపట్నం ఆర్డీవో వివి రమణ ఆదేశించారు. మండలంలో సమస్యాత్మక గ్రామమైన కిత్తంపేట, పోలింగ్ కేంద్రాన్ని తాసిల్దార్ అంబేద్కర్ ఎంపీడీవో మహేష్ లతో పాటు శుక్రవారం ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన సౌకర్యాలు పై ఆరా తీశారు. మండలంలో . అన్ని పోలింగ్ బూత్ ల వద్ద. విద్యుత్ దీపాలు అమర్చాలని, జనరేటర్లు అందుబాటులో ఉంచాలని తాసిల్దార్ కు ఆదేశించారు. జడ్. బెన్నవరం పంచాయతీలో బెన్నవరం లో రెండు కిత్తం పేట లో ఆరు పోలింగ్ బూతులలో పోలింగ్ కు ఏర్పాటు చేశామన్నారు. 8 పోలింగ్ బూత్ లో బ్యాలెట్ బాక్స్ లను కిత్తంపేట. యుపి స్కూలలో ఓట్ల లెక్కింపు చేస్తామన్నారు. బెన్నవరం నుంచి బ్యాలెట్ బాక్సులు పోలీస్ భద్రతతో కిత్తంపేటకు తీసుకురావాలని ఆదేశించారు. అలాగే చీమలపాడు పంచాయితీ సర్పంచ్ ఎన్నికలు అంగన్వాడి, పంచాయతీ కార్యాలయం పాఠశాల, ములకలపల్లి లో జరుగుతున్నాయని చెప్పారు. వీటన్నిటి నుంచి బ్యాలెట్ బాక్స్ లను చీమలపాడు పోలీస్ భద్రత మధ్య తరలించి కౌంటింగ్ చేయాలని తెలిపారు. రావికమతం మండలంలో సమస్యాత్మక గ్రామాలు ఎనిమిది, రోలుగుంట మండలంలో సమస్య ఆత్మక గ్రామాల 9లలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. అలాగే రావికమతం మండలం కొత్తకోట గ్రామంలో ఎక్కువ ఓటర్లు ఉన్నందున ఈ గ్రామంలో కూడా పోలీస్ బందోబస్తు తగినంత మందిని నియమించాలని కోరమన్నారు.