BREAKING
ఆనందపురం నూతన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలకు ఎమ్మెల్యే గంటా ఘన సత్కారం బ్రహ్మలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు దంపతులు* ఎస్.రాయవరం మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సోమిరెడ్డి లక్ష్మి నామినేషన్! మాడుగుల జడ్పీటీసీ సభ్యునిగా పుప్పాల లక్ష్మి నారాయణ ప్రమాణ స్వీకారం గోవింద నామస్మరణతో మార్మోగిన ఎస్.రాయవరం! మాకవరపాలెం జడ్పీటీసీగా అల్లు రామనాయుడు ప్రమాణ స్వీకారం క్రీడల్లో పాల్గొనడం వలన మంచి డైరెక్టర్ వ్యాయామం, అభినందించిన ఏ యూ డైరెక్టర్ అఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆచార్య ఎ. పల్లవి పెనుగొల్లులో చలో ఢిల్లీ పోస్టర్ విడుదల! గెడ్డపాలెంలో వైఎస్సార్‌సీపీ సత్తా చాటిన పీవీఆర్! కోనసీమ జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్‌గా గొల్లపల్లి అమూల్య.. హోంమంత్రి అనిత సహకారంతో అభివృద్ధి చేస్తా! కొరుప్రోలు జడ్పీ హైస్కూల్లో ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు! ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద పెద్దేరు జలాశయంలో చేప పిల్లల విడుదల కనకమహాలక్ష్మి మార్గశిర ఉత్సవాలకు శ్రీకారం అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద విద్యుత్ దీపాలు అమర్చాలి

బ్రహ్మలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు దంపతులు*

Select Suryaa Now
బ్రహ్మలింగేశ్వర స్వామి  కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు దంపతులు*

 

​నర్సీపట్నం, నవంబర్ 20 మేజర్ న్యూస్ :
అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం మండలం, బలిఘట్టం గ్రామంలో వేంచేసియున్న శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీకమాస మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కార్తీక శుద్ధ ఏకాదశి (శుక్రవారం) పర్వదినాన్ని పురస్కరించుకుని రాత్రి 7 గంటలకు స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు.  

​ఈ పవిత్ర కార్యక్రమానికి రాష్ట్ర శాసనసభ గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన సతీమణి, మున్సిపల్ చైర్‌పర్సన్ చింతకాయల పద్మావతి దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఆలయానికి చేరుకున్న దంపతులకు వేద పండితులు, అర్చకులు మేళతాళాలతో, పూర్ణకుంభంతో సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు.
ఈ నెల 24వ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా త్రిశూల పర్వత శిఖరాగ్రమున కృత్తికా దీపోత్సవం, "అఖండ జ్యోతి" వెలిగించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. ఈ దీపోత్సవానికి ఒత్తులు, నెయ్యి సమర్పించదలచిన భక్తులు ఆలయం వద్ద అందించాలని వారు కోరారు.

​ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గుర్ల శ్రీను, వార్డు కౌన్సలర్లు, ఆలయ కమిటీ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.  
​