BREAKING
ఆనందపురం నూతన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలకు ఎమ్మెల్యే గంటా ఘన సత్కారం బ్రహ్మలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు దంపతులు* ఎస్.రాయవరం మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సోమిరెడ్డి లక్ష్మి నామినేషన్! మాడుగుల జడ్పీటీసీ సభ్యునిగా పుప్పాల లక్ష్మి నారాయణ ప్రమాణ స్వీకారం గోవింద నామస్మరణతో మార్మోగిన ఎస్.రాయవరం! మాకవరపాలెం జడ్పీటీసీగా అల్లు రామనాయుడు ప్రమాణ స్వీకారం క్రీడల్లో పాల్గొనడం వలన మంచి డైరెక్టర్ వ్యాయామం, అభినందించిన ఏ యూ డైరెక్టర్ అఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆచార్య ఎ. పల్లవి పెనుగొల్లులో చలో ఢిల్లీ పోస్టర్ విడుదల! గెడ్డపాలెంలో వైఎస్సార్‌సీపీ సత్తా చాటిన పీవీఆర్! కోనసీమ జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్‌గా గొల్లపల్లి అమూల్య.. హోంమంత్రి అనిత సహకారంతో అభివృద్ధి చేస్తా! కొరుప్రోలు జడ్పీ హైస్కూల్లో ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు! ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద పెద్దేరు జలాశయంలో చేప పిల్లల విడుదల కనకమహాలక్ష్మి మార్గశిర ఉత్సవాలకు శ్రీకారం అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద విద్యుత్ దీపాలు అమర్చాలి

కోనసీమ జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్‌గా గొల్లపల్లి అమూల్య..

Select Suryaa Now
కోనసీమ జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్‌గా గొల్లపల్లి అమూల్య..

కోనసీమ జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్‌గా గొల్లపల్లి అమూల్య..        వైస్ చైర్మన్‌గా యెలిశెట్టి రామకృష్ణ...    అమలాపురం మేజర్ న్యూస్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారిగా జిల్లా ప్రజా పరిషత్ కార్యవర్గం కొలువుదీరింది.
అమలాపురం ఈదరపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
మామిడికుదురు జడ్పీటీసీ సభ్యురాలు గొల్లపల్లి అమూల్య జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే కొత్తపేట జడ్పీటీసీ సభ్యుడు యెలిశెట్టి రామకృష్ణ వైస్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల సాధారణ పరిశీలకులు టి.ప్రశాంతి, ప్రిసైడింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైదియా దేవి సమక్షంలో ఈ ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, గిడ్డి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ముందుగా జిల్లాలోని 19 మండలాలకు చెందిన నూతన జడ్పీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికల ప్రక్రియ చేపట్టగా సభ్యులందరూ ఏకగ్రీవంగా తమ మద్దతు ప్రకటించారు.ప్రమాణ స్వీకారం అనంతరం నూతన చైర్‌పర్సన్ గొల్లపల్లి అమూల్య మాట్లాడుతూ.. కోనసీమ జిల్లా ఏర్పడిన తర్వాత తొలి జడ్పీ చైర్‌పర్సన్‌గా, తొలి మహిళగా ఎన్నిక కావడం తనకు ఎంతో గౌరవంగా భావిస్తున్నానన్నారు.తనపై నమ్మకంతో ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.                             రంబాల సత్యనారాయణ అమలాపురం