కనకమహాలక్ష్మి మార్గశిర ఉత్సవాలకు శ్రీకారం
శాస్త్రోత్తంగా అమ్మవారి ఆలయం వద్ద ఉత్సవ వార్త ముహూర్తం
పాల్గొన్న దేవాదాయ శాఖ అధికారులు ఉద్యోగులు, పాలకమండలి చైర్మన్, సభ్యులు
విశాఖపట్నం, నవంబర్ 20, మేజర్ న్యూస్ : వచ్చే నెల 9 నుండి ప్రారంభం కానున్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు మార్గశిర మాస ఉత్సవాలకు శుక్రవారం ఆలయం ప్రాంగణంలో వినాయకుని రాట మహోత్సవం శాస్త్రృత్తంగా ఆలయ అధికారులు, అమ్మవారి భక్తులు పురప్రజలు, పాలకమండలి సభ్యులు నిర్వహించారు. ఉదయం 9 గంటల 35 నిమిషాల సమయంలో కనకమహాలక్ష్మి అమ్మవారు ఉత్సవరాటకు ముత్తైదువలు పసుపు కుంకుమ తో బొట్లు పెట్టి ప్రత్యేక పూజలను నిర్వహించారు వేద పండితుల ఆశీర్వచనాలతో సన్నాయిమేళాల సందడితో ఉత్సవరాటను ఆలయ ఈవో శోభారాణి, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కందుల నాగరాజు, పాలకమండలి సభ్యులు, పుర ప్రజలు, అమ్మవారి భక్తులు ముత్తయిదులు సమక్షంలో అమ్మవారి ఉత్సవరాటను ఏర్పాటు చేశారు. ఉత్సవరాటకు భక్తిశ్రద్ధలతో దేవస్థానం ఉద్యోగులు పాలకమండలి సభ్యులు ప్రజలు బు రుజుపేట ప్రాంత వాసులు పూజలు నిర్వహించారు. అమ్మవారు ఉత్సవరాటతో మార్గశిర మాస ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. నేటి నుండి ఆలయ ప్రాంగణంలో మార్గశిర మాస ఉత్సవాల ఏర్పాట్లు చేసేందుకు ఆలయ అధికారులు సన్నద్ధమవుతున్నారు. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి రాక మహోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుండి సాయంత్రం వరకు అమ్మవారి దర్శనాలకు భక్తులు క్యూలు కట్టారు. ఉత్సవ ఏర్పాటు చేసిన స్థలం వద్ద ముత్తైదువులు మహిళలు పసుపు కుంకుమలు అర్పించి దీపారాధన చేశారు. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాస మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగేందుకు వినాయకుడి ఆశీస్సులు ఉత్సవ రాట ద్వారా చేకూరుతుందని వేద పండితులు, ఆలయ పూజారులు వెల్లడించారు. డిసెంబర్ 9 నుండి జనవరి 7 వరకు మార్గశిర మహోత్సవాలు జరగనున్నాయి. ఈ ఏడాది ప్రత్యేకంగా ఐదు గురువారాలు రావడంతో కలెక్టర్ పరిరక్షణలో దేవస్థానం అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేపడుతున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఆన్ లైన్ ద్వారా టిక్కెట్లను తీసుకునే సదుపాయాన్ని ప్రత్యేకంగా ఈ సంవత్సరం అందుబాటులోకి జిల్లా యంత్రాంగం తీసుకురానుంది. ఉచిత దర్శనాలు 200 రూపాయలు 500 రూపాయలు క్యూలైన్లు తోపాటు వీఐపీ దర్శనాలకు ప్రత్యేకంగా ఆలయ అధికారులు క్యూ లైన్ లో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్షలో ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఉద్యోగులు పాలకమండలి చైర్మన్ నాగరాజు, సభ్యులు పాల్గొన్నారు.