కొరుప్రోలు జడ్పీ హైస్కూల్లో ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు!
ఎస్.రాయవరం, నవంబర్ 20, మేజర్ న్యూస్:
ఎస్.రాయవరం మండలం కొరుప్రోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నవంబర్ 14 నుంచి 20 వరకు నిర్వహించిన జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ రంగాల్లో పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు గ్రంథాలయ అధికారిణి నాగరాజేశ్వరి, ప్రధానోపాధ్యాయులు ప్రసాద్ బహుమతులు అందజేశారు. కార్యక్రమాన్ని తెలుగు ఉపాధ్యాయులు శారదాదేవి, మంగమ్మ, దుర్గాప్రసాద్ నిర్వహించగా, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.