పలాస కు అరుదైన గౌరవం.
జెడ్పీ వైస్ చైర్మన్ గా విజయ్ కుమార్.
మత్స్యకారుడికి జిల్లా పదవి - ఫలించిన ఎమ్మెల్యే శిరీష కృషి.
పలాస, నవంబర్ 20, మేజర్ న్యూస్.
శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా పలాస నియోజకవర్గం,వజ్రపుకొత్తూరు మండల జడ్పీటీసీ సభ్యులు గుంటు విజయ్ కుమార్ ఎంపిక కావడం పట్ల పలాస నియోజకవర్గంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.ఈ నియామకం వెనుక పలాస శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష ప్రత్యేక చొరవ, నిరంతర కృషి కీలకంగా నిలిచాయని నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
పలాసకు జిల్లా స్థాయిలో కీలక పదవి.
పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న నాయకులకు సముచిత గుర్తింపు కల్పించాలనే ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రయత్నాలు ఫలించడంతో వజ్రపుకొత్తూరు మండలానికి, పలాస నియోజకవర్గానికి జిల్లా స్థాయిలో కీలక పదవి దక్కిందని స్థానిక నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మత్స్యకారుల పట్ల మరోసారి చాటుకున్న అభిమానం.
మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన గుంటు విజయ్ కుమార్‌కు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వంటి కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మత్స్యకారుల పట్ల తనకున్న అభిమానాన్ని, గౌరవాన్ని మరోసారి చాటుకున్నారని పలువురు పేర్కొన్నారు.బీసీలు, మత్స్యకారులు, బలహీన వర్గాలకు రాజకీయంగా సముచిత ప్రాధాన్యత కల్పించడంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుందనే విషయానికి ఈ నియామకం నిదర్శనంగా నిలుస్తోందన్నారు.
ఎమ్మెల్యే గౌతు శిరీషకు ప్రత్యేక కృతజ్ఞతలు.
గుంటు విజయ్ కుమార్‌కు ఈ కీలక పదవి లభించడంలో ఎమ్మెల్యే గౌతు శిరీష కృషి ప్రత్యేకంగా నిలిచిందని నియోజకవర్గ నాయకులు, మత్స్యకార సంఘాల ప్రతినిధులు, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.పలాస నియోజకవర్గానికి జిల్లా స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చేలా కృషి చేసిన ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.అదేవిధంగా మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి ఇంతటి కీలక బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,యువనేత నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు,జిల్లా పార్టీ నాయకత్వానికి,పలాస నియోజకవర్గ నాయకులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.గుంటు విజయ్ కుమార్ ఎంపికతో వజ్రపుకొత్తూరు మండలంతో పాటు పలాస నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొందని, మత్స్యకార సామాజిక వర్గంలో ఆనందం వెల్లివిరుస్తోందని నాయకులు పేర్కొన్నారు.