BREAKING
బ్రహ్మలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు దంపతులు* ఎస్.రాయవరం మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సోమిరెడ్డి లక్ష్మి నామినేషన్! మాడుగుల జడ్పీటీసీ సభ్యునిగా పుప్పాల లక్ష్మి నారాయణ ప్రమాణ స్వీకారం గోవింద నామస్మరణతో మార్మోగిన ఎస్.రాయవరం! మాకవరపాలెం జడ్పీటీసీగా అల్లు రామనాయుడు ప్రమాణ స్వీకారం క్రీడల్లో పాల్గొనడం వలన మంచి డైరెక్టర్ వ్యాయామం, అభినందించిన ఏ యూ డైరెక్టర్ అఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆచార్య ఎ. పల్లవి పెనుగొల్లులో చలో ఢిల్లీ పోస్టర్ విడుదల! గెడ్డపాలెంలో వైఎస్సార్‌సీపీ సత్తా చాటిన పీవీఆర్! కోనసీమ జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్‌గా గొల్లపల్లి అమూల్య.. హోంమంత్రి అనిత సహకారంతో అభివృద్ధి చేస్తా! కొరుప్రోలు జడ్పీ హైస్కూల్లో ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు! ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద పెద్దేరు జలాశయంలో చేప పిల్లల విడుదల కనకమహాలక్ష్మి మార్గశిర ఉత్సవాలకు శ్రీకారం అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద విద్యుత్ దీపాలు అమర్చాలి 38వ వార్డులో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు.

మెల్లకన్నును గుర్తించండి - చిన్నారులకు అండగా నిలవండి - ఎల్ వి ప్రసాద్ హాస్పిటల్ వైద్య నిపుణులు

Select Suryaa Now
మెల్లకన్నును గుర్తించండి - చిన్నారులకు అండగా నిలవండి - ఎల్ వి ప్రసాద్ హాస్పిటల్  వైద్య నిపుణులు

ఆరిలోవ, నవంబర్ 20, మేజర్ న్యూస్ : చిన్నారుల్లో మెల్లకన్ను సమస్యను తొలిదశలోనే గుర్తించి, సకాలంలో చికిత్స అందించడంపై అవగాహన కల్పించేందుకు ఎల్.వి. ప్రసాద్ నేత్ర వైద్యశాల, జిఎంఆర్  వరలక్ష్మి  కాంప్లెక్స్, విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో బాలల నేత్ర సంరక్షణ వారోత్సవాలు “మెల్లకన్నును గుర్తించండి – చిన్నారులకు అండగా నిలవండి” అనే ప్రధాన ఇతివృత్తంగా నిర్వహించారు. ఈనెల 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా చిన్నారుల్లో మెల్లకన్ను సమస్యపై తల్లిదండ్రులు, సంరక్షకులకు అవగాహన కల్పించడం, ఈ సమస్యకు సంబంధించి సమాజంలో నెలకొన్న అపోహలను తొలగించడం, వ్యాధిని తొలిదశలోనే గుర్తించి సకాలంలో చికిత్స అందించడం యొక్క ప్రాముఖ్యతను వివరించారు.
          ఎల్.వి. ప్రసాద్ నేత్ర వైద్యశాల ఆధ్వర్యంలో 15 నవంబర్  ఆదివారం నాడు ‘బాలల నేత్ర ఆరోగ్య అవగాహన పాదయాత్ర ను ఆర్.కె. బీచ్ రోడ్డులో కాళీమందిర్  వద్ద నిర్వహించారు. ఈ పాద యాత్రను క్యాంపస్ హెడ్ డాక్టర్ వీరేందర్ సచ్‌దేవ్  జెండా ఊపి ప్రారంభించారు.ఇందులో 200 మంది వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. వివిధ అవగాహన నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించారు.
         ‘విశాఖపట్నం ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు  యశోధర ఈ పాదయాత్రలో పాల్గొని, ప్రజలు ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి  అవగాహన కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.
                     ఈ సందర్భంగా విశాఖపట్నంలోని జిఎంఆర్  వరలక్ష్మి క్యాంపస్‌కు చెందిన పీడియాట్రిక్ ఆప్తాల్మాలజిస్ట్ డాక్టర్ అభిషేక్ గురుసేకరన్ మాట్లాడుతూ, “మెల్లకన్ను అనేది కేవలం కళ్ల రూపానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ఇది ప్రధానంగా చిన్నారి చూపు, దృష్టి అభివృద్ధికి సంబంధించిన అంశం. మెల్లకన్నుకు చికిత్స అందుబాటులో ఉంది. సమస్యను తొలిదశలోనే గుర్తించి, తగిన చికిత్స అందించడం ద్వారా చిన్నారుల చూపు, ఆత్మవిశ్వాసంలో గణనీయమైన మార్పు తీసుకురాగలుగుతాం” అని తెలిపారు.