మాదాపూర్‌లో గంజాయి కలకలం... స్విగ్గీ డెలివరీబాయ్ అరెస్ట్
హైదరాబాద్: హైదరాబాద్‌లోని మాదాపూర్ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న స్విగ్గీ డెలివరీబాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 1,089 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి గంజాయిని నగరానికి తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.