గ్రామీణ పనులకు రూ.16,000 కోట్లు విడుదల చేసిన కర్ణాటక ప్రభుత్వం...
కర్ణాటకలో గ్రామీణ ప్రాంతాల మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శుక్రవారం రూ.16,000 కోట్ల నిధులను విడుదల చేశారు. ఇందులో 15,000 కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధికి రూ.10,000 కోట్లు, పంచాయతీల అభివృద్ధికి రూ.6,000 కోట్లు కేటాయించారు. ఈ నిధులు కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి కాదని, పనుల్లో నాణ్యత, పారదర్శకత తప్పనిసరిగా పాటించాలని సీఎం స్పష్టం చేశారు. చెరువుల ఆక్రమణల తొలగింపు కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడంతో పాటు, పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.