BREAKING
దానం నాగేందర్ ఎన్నిక చెల్లదంటూ పిటిషన్... ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు మాదాపూర్‌లో గంజాయి కలకలం... స్విగ్గీ డెలివరీబాయ్ అరెస్ట్ మేయర్ రమేష్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్యవైశ్య సంఘం కమిటీ సభ్యులు 'సూపర్ సిక్స్' అమలు అసాధ్యం... మండల యాక్టివ్ సర్పంచ్ గా చుక్క హిమబిందు శ్రీశైలం జుక్కల్‌లో భూ రీసర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ నగేష్ బీఆర్ఎన్ను విమర్శించడం తప్ప అభివృధ్ధి శూన్యం మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అల్లాదుర్గం మండల స్థాయి క్విజ్ పోటీలు * * విజయకేతరం ఎగరేసిన ముస్లాపూర్ విద్యార్థులు ఒకప్పుడు గ్రాండ్ థెఫ్ట్ ఆటోపై నిషేధం.. ఇప్పుడు ఆ సంస్థలో సౌదీ అరేబియా భారీ వాటా పెద్దాపూర్‌లో ఎస్ఎస్‌వీ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభం శంషొద్దీన్ పూర్ గ్రామంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం రీ సర్వే అభ్యంతరాల దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ హరిహరుల అనుగ్రహం కోసం దీపారాధన.. పురాణాల్లో విశిష్ట స్థానం..కార్తీక ద్వాదశి విశిష్టత.. ప్యాపిలి సర్పంచ్ బరిలో వైసీపీ స్వతంత్ర అభ్యర్థులు.. నామినేషన్లు దాఖలు చేయనున్న అభ్యర్థులు.

అల్లాదుర్గం మండల స్థాయి క్విజ్ పోటీలు * * విజయకేతరం ఎగరేసిన ముస్లాపూర్ విద్యార్థులు

Select Suryaa Now
అల్లాదుర్గం మండల స్థాయి క్విజ్ పోటీలు *  * విజయకేతరం ఎగరేసిన ముస్లాపూర్ విద్యార్థులు

అల్లాదుర్గ్ .…అల్లాదుర్గం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అల్లాదుర్గంలో  మెదక్ జీనియస్ క్వెస్ట్ – 2026 మండల స్థాయి క్విజ్ పోటీలను ఎంఈఓ  లక్ష్మణ్ గారి అధ్యక్షతన, క్విజ్ఇన్‌చార్జి,గడిపెద్దాపూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు  నర్సింహులు  సమక్షంలో నిర్వహించారు.ఈ పోటీల్లో మండలంలోని గడిపెద్దాపూర్, ముస్లాపూర్, చిల్వేర్, కేజీబీవీ బాలికల పాఠశాల, అల్లాదుర్గం బాలుర మరియు బాలికల ఉన్నత పాఠశాలలకు చెందిన మొత్తం ఆరు పాఠశాలల నుంచి 18 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి పాఠశాల నుంచి 8, 9, 10వ తరగతులకు చెందిన ఒక్కొక్క విద్యార్థిని పాఠశాల స్థాయిలో ఎంపిక చేసి మండల స్థాయి పోటీలకు నామినేట్ చేశారు.8, 9, 10వ తరగతుల విద్యార్థులకు వేర్వేరు విభాగాల్లో నిర్వహించిన క్విజ్ పోటీల్లో * పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  ముస్లాపూర్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి మూడు విభాగాల్లోనూ ప్రథమ స్థానాలను కైవసం చేసుకున్నారు
 విజేత విద్యార్థులు: 10వ తరగతి – పి. పూజాశ్రీ ,9వ తరగతి – కార్తిక్ ,  8వ తరగతి – వైష్ణవి ,విజేతలకు ప్రశంసాపత్రాలతో పాటు షీల్డులను అందజేశారు. వీరు త్వరలో నిర్వహించనున్న జిల్లా స్థాయి క్విజ్ పోటీల్లో పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమంలో అల్లాదుర్గం కాంప్లెక్స్ హెచ్ఎం  పిచ్చయ్య , క్విజ్ మాస్టర్లు నర్సింహులు, సత్యనారాయణ, కృష్ణ, టెక్నికల్ పర్సన్లు జనార్దన్, వీరప్ప, గోవిందలీల, చిల్వేర్ హెచ్ఎం సవిత, ముస్లాపూర్ హెచ్ఎం సంజీవయ్య, ఉపాధ్యాయులు శ్రీనివాస్, శ్రీకాంత్, మచ్చేందర్, స్వప్న, పాండురంగం, వేణుమాధవరెడ్డి,ప్రతిభ, ఫరీదా తదితరులు పాల్గొన్నారు.