మేయర్ రమేష్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్యవైశ్య సంఘం కమిటీ సభ్యులు
అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్ : అనంతపురం మేయర్ రమేష్ గౌడ్ ని పాత ఊరు అమ్మవారిశాల ఆర్యవైశ్య సంఘం కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మేయర్‌ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులు, పాత ఊరు ప్రాంతంలోని మౌలిక సదుపాయాలు మరియు స్థానిక సమస్యలపై మేయర్‌తో చర్చించారు. కమిటీ సభ్యులు ప్రస్తావించిన అంశాలపై మేయర్ రమేష్ గౌడ్ సానుకూలంగా స్పందిస్తూ, తగిన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పాత ఊరు అమ్మవారిశాల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు మరియు పెద్దలు పాల్గొన్నారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్ అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్