BREAKING
పెద్దాపూర్‌లో ఎస్ఎస్‌వీ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభం శంషొద్దీన్ పూర్ గ్రామంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం రీ సర్వే అభ్యంతరాల దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ హరిహరుల అనుగ్రహం కోసం దీపారాధన.. పురాణాల్లో విశిష్ట స్థానం..కార్తీక ద్వాదశి విశిష్టత.. ప్యాపిలి సర్పంచ్ బరిలో వైసీపీ స్వతంత్ర అభ్యర్థులు.. నామినేషన్లు దాఖలు చేయనున్న అభ్యర్థులు. చీరాల మండలంలో 700 నామినేషన్లు వడ్ల కొనుగోళ్లలో జాప్యం.. రైతులకు కష్టాలు! కేంద్రాల్లో పేరుకుపోతున్న ధాన్యం.. అధికారుల మధ్య సమన్వయ లోపం నేడు కొనసానున్న ఎల్‌ఆర్‌ఎస్ మేళాకు ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యే అమరనాథ రెడ్డికి ఆహ్వానం నీటిని పొదుపుగా వాడటం ప్రతి ఒక్కరి బాధ్యత సంవిధాన్ ఉత్సవ్ -2026 ధర్మస్థలంలో ఘనంగా దీపికమ్మ సోదరి వివాహ వేడుక.. ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఘనంగా ముగిసిన 59వ వారోత్సవాలు జాతీయ గ్రంధాలయ పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మున్సిపల్ వైస్ చైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి వేడుకగా సాగిన వైసిపి నాయకుడు బాలాజీ గృహప్రవేశం : హాజరైన వైకాపా సమన్వయకర్త నిస్సార్ అహ్మద్,నాయకులు

ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఘనంగా ముగిసిన 59వ వారోత్సవాలు జాతీయ గ్రంధాలయ

Select Suryaa Now
ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఘనంగా ముగిసిన 59వ వారోత్సవాలు జాతీయ గ్రంధాలయ

ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఘనంగా ముగిసిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

ఏలూరు, మేజర్ న్యూస్:

ఏలూరు సత్రంపాడులోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో నిర్వహించిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు వేడుకల్లో కళాశాల ప్రిన్సిపాల్  వంగ.వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం నవంబర్ 14 నుంచి 20 వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహించుకుంటామని తెలిపారు. గ్రంథాలయాలు విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడంతో పాటు విజ్ఞానాన్ని, వ్యక్తిత్వ వికాసాన్ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి ప్రతిరోజూ కొంత సమయాన్ని పుస్తక పఠనానికి కేటాయించాలని, ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు పోటీపరీక్షలకు అవసరమైన పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

కళాశాల లైబ్రేరియన్ పుప్పాల వీరభద్రరావు మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు తమ విజ్ఞానాన్ని నిరంతరం పెంపొందించుకోవడానికి గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పుస్తక పఠనం ద్వారా మంచి ఆలోచనా విధానం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం అలవడతాయని, ప్రతి విద్యార్థి గ్రంథాలయాన్ని తన జ్ఞానాభివృద్ధికి వేదికగా చేసుకోవాలని కోరారు.

జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా నవంబర్ 14 నుంచి 20 వరకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖన మరియు క్విజ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. 

అనంతరం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించడంలో విశేష కృషి చేసిన కళాశాల లైబ్రేరియన్ పుప్పాల వీరభద్రరావు ను ఆదిత్య విద్యాసంస్థల యాజమాన్యం ఘనంగా శాలువా కప్పి, పుష్పగుచ్ఛంతో సత్కరించి అభినందించింది.

ఈ కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన విద్యార్థులను ఆదిత్య విద్యాసంస్థల ఛైర్మన్ డా. ఎన్. శేషారెడ్డి, సెక్రటరీ డా. ఎన్. సుగుణారెడ్డి మరియు అకడమిక్ డైరెక్టర్ డా. బి.వి.వై.ఎల్. నాయుడు అభినందించారు. 

ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డి.వి.వి. ఫణికుమార్, లైబ్రేరియన్ పుప్పాల.వీరభద్రరావు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్  కె.హరిబాబు, కల్చరల్ కోఆర్డినేటర్ పి.సౌభాగ్యలక్ష్మి,  ఆంగ్ల విభాగాధిపతి ఎస్.అనురాధ, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.