సంవిధాన్ ఉత్సవ్ -2026
పాలమూరు యూనివర్సిటీ,మేజర్ న్యూస్-
77వ రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో భాగంగా పాలమూరు విశ్వవిద్యాలయం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ రోడ్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు భారత రాజ్యాంగం, హక్కులు, బాధ్యతలు, రాజ్యాంగ విలువలపై అవగాహన కల్పించి, రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా. భూమయ్య, విభాగాధిపతి కె. వెంకటసాయి ప్రసాద్, అధ్యాపకులు ఎం. కిరణ్, కె. శ్రీకాంత్, అక్షయ, ఎల్‌ఎల్‌బీ ప్రథమ సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు.
ఎం.ఓం ప్రకాష్ ,పాలమూరు యూనివర్సిటీ.మహబూబ్ నగర్