BREAKING
పెద్దాపూర్‌లో ఎస్ఎస్‌వీ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభం శంషొద్దీన్ పూర్ గ్రామంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం రీ సర్వే అభ్యంతరాల దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ హరిహరుల అనుగ్రహం కోసం దీపారాధన.. పురాణాల్లో విశిష్ట స్థానం..కార్తీక ద్వాదశి విశిష్టత.. ప్యాపిలి సర్పంచ్ బరిలో వైసీపీ స్వతంత్ర అభ్యర్థులు.. నామినేషన్లు దాఖలు చేయనున్న అభ్యర్థులు. చీరాల మండలంలో 700 నామినేషన్లు వడ్ల కొనుగోళ్లలో జాప్యం.. రైతులకు కష్టాలు! కేంద్రాల్లో పేరుకుపోతున్న ధాన్యం.. అధికారుల మధ్య సమన్వయ లోపం నేడు కొనసానున్న ఎల్‌ఆర్‌ఎస్ మేళాకు ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యే అమరనాథ రెడ్డికి ఆహ్వానం నీటిని పొదుపుగా వాడటం ప్రతి ఒక్కరి బాధ్యత సంవిధాన్ ఉత్సవ్ -2026 ధర్మస్థలంలో ఘనంగా దీపికమ్మ సోదరి వివాహ వేడుక.. ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఘనంగా ముగిసిన 59వ వారోత్సవాలు జాతీయ గ్రంధాలయ పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మున్సిపల్ వైస్ చైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి వేడుకగా సాగిన వైసిపి నాయకుడు బాలాజీ గృహప్రవేశం : హాజరైన వైకాపా సమన్వయకర్త నిస్సార్ అహ్మద్,నాయకులు

నీటిని పొదుపుగా వాడటం ప్రతి ఒక్కరి బాధ్యత

Select Suryaa Now
నీటిని పొదుపుగా వాడటం ప్రతి ఒక్కరి బాధ్యత

మునగాల మేజర్ న్యూస్, మునగాల :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పీఎం శ్రీ  తెలంగాణ మోడల్ స్కూల్ మునగాల నందు జల సంరక్షణ, ప్రపంచ బాలల హక్కుల పరిరక్షణ ప్రతిజ్ఞ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇన్చార్జి ప్రిన్సిపాల్ డా. జె. రామకృష్ణ మాట్లాడుతూ నీటిని పొదుపుగా వాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. నీరు లేనిదే జీవనం లేదని, నీటిని వృథా చేయడం అంటే భవిష్యత్ తరాలకు అన్యాయం చేయడమేనని తెలిపారు. విద్యార్థులు చిన్న వయసు నుంచే నీటి విలువను తెలుసుకొని, ఇంట్లో, పాఠశాలలో నీటిని జాగ్రత్తగా వాడాలని సూచించారు.

అలాగే ప్రతి బిడ్డకు విద్య, ఆరోగ్యం, రక్షణ పొందే హక్కు ఉందని, బాలల హక్కులను కాపాడటం సమాజంలోని ప్రతి ఒక్కరి కర్తవ్యమని ఆయన అన్నారు. బాలలపై ఎలాంటి వేధింపులు, వివక్ష ఉండకూడదని, పిల్లలను ప్రేమతో, గౌరవంతో చూడాలని పిలుపునిచ్చారు.

అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు జల సంరక్షణ మరియు బాలల హక్కుల పరిరక్షణపై ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో జాకీర్, రవీందర్ రెడ్డి, వెంకటేశ్వర్ల రావు, బి. సైదులు గౌడ్, వాణి, సుబ్రహ్మణ్యం, రంజాన్ బి, పీడీ, జానీ పాషా, రమేష్, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.