నేడు కొనసానున్న ఎల్‌ఆర్‌ఎస్ మేళాకు
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్) దరఖాస్తుల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక ‘ఎల్‌ఆర్‌ఎస్ మేళా’కు శుక్రవారం అనూహ్య స్పందన లభించింది. నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ మేళా శనివారం కూడా కొనసాగనుందని సిటీ ప్లానర్ డి.రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు.జీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌తో పాటు బృందావన్ గార్డెన్స్‌లోని సర్కిల్ కార్యాలయంలో ప్రత్యేక మేళా నిర్వహిస్తున్నట్లు సిటీ ప్లానర్ పేర్కొన్నారు. శుక్రవారం జరిగిన కార్యక్రమానికి 155 మంది దరఖాస్తుదారులు హాజరై తమ సమస్యలను పరిష్కరించుకున్నారని, ఇంజినీర్లు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని వివరించారు. పట్టణ ప్రణాళిక సిబ్బంది దరఖాస్తుదారులకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నారన్నారు.ఇంకా ఎవరైనా పెండింగ్ దరఖాస్తుదారులు ఉంటే శనివారం జరిగే మేళాలో పాల్గొని తమ దరఖాస్తులను క్లియర్ చేసుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యంగా ఫీజు చెల్లించాల్సి ఉన్నవారు, దరఖాస్తుల పరిశీలనలో భాగంగా షార్ట్ ఫాల్ ఎండార్స్‌మెంట్లు జారీ అయి అవసరమైన పత్రాలు సమర్పించాల్సి ఉన్నవారు సంబంధిత పత్రాలు, రసీదులతో హాజరై ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సూర్య నాయక్