రీ సర్వే అభ్యంతరాల దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ
మెదక్ ప్రతినిధి ; మెదక్ మండలంలోని పాశాపూర్ గ్రామంలో భూ రీ సర్వేకు సంబంధించి 9(2) నోటీసులు జారీ చేసిన అనంతరం భూ యజమానుల నుంచి అందిన అభ్యంతరాల దరఖాస్తులపై ఈరోజు మెదక్ ఆర్డీవో రామాదేవి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా 9(2) నోటీసుల అనంతరం అందిన అభ్యంతర పిటిషన్లను పరిశీలించి, భూ యజమానులు లేవనెత్తిన సమస్యలు, అభ్యంతరాలపై చర్చించారు. సంబంధిత భూముల వివరాలు, రెవెన్యూ మరియు సర్వే రికార్డులను పరిశీలిస్తూ అభ్యంతరాల పరిష్కారానికి అవసరమైన చర్యలపై సమీక్షించారు.
భూ యజమానుల అభ్యంతరాలను నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి, పారదర్శకంగా రీ సర్వే ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని సమావేశంలో చర్చించారు.
ఈ కార్యక్రమంలో మెదక్ తహసిల్దార్ లక్ష్మణ్ బాబు, అధికారులు పాల్గొన్నారు.