BREAKING
దానం నాగేందర్ ఎన్నిక చెల్లదంటూ పిటిషన్... ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు మాదాపూర్‌లో గంజాయి కలకలం... స్విగ్గీ డెలివరీబాయ్ అరెస్ట్ మేయర్ రమేష్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్యవైశ్య సంఘం కమిటీ సభ్యులు 'సూపర్ సిక్స్' అమలు అసాధ్యం... మండల యాక్టివ్ సర్పంచ్ గా చుక్క హిమబిందు శ్రీశైలం జుక్కల్‌లో భూ రీసర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ నగేష్ బీఆర్ఎన్ను విమర్శించడం తప్ప అభివృధ్ధి శూన్యం మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అల్లాదుర్గం మండల స్థాయి క్విజ్ పోటీలు * * విజయకేతరం ఎగరేసిన ముస్లాపూర్ విద్యార్థులు ఒకప్పుడు గ్రాండ్ థెఫ్ట్ ఆటోపై నిషేధం.. ఇప్పుడు ఆ సంస్థలో సౌదీ అరేబియా భారీ వాటా పెద్దాపూర్‌లో ఎస్ఎస్‌వీ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభం శంషొద్దీన్ పూర్ గ్రామంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం రీ సర్వే అభ్యంతరాల దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ హరిహరుల అనుగ్రహం కోసం దీపారాధన.. పురాణాల్లో విశిష్ట స్థానం..కార్తీక ద్వాదశి విశిష్టత.. ప్యాపిలి సర్పంచ్ బరిలో వైసీపీ స్వతంత్ర అభ్యర్థులు.. నామినేషన్లు దాఖలు చేయనున్న అభ్యర్థులు.

ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం

Select Suryaa Now
ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ  నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం

రామాయంపేట ; నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని రామాయంపేట మండలం కాట్రా యాల గ్రామ సర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్ గుప్తా తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ వారి సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా శుక్రవారం కార్యాల గ్రామంలో నూతనంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు సర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్ గుప్తా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇళ్ల నిర్మాణాలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేపట్టి, ఇంటి నిర్మాణ పనులను పూర్తి చేసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బాబు నాయక్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు నరేష్‌తో పాటు గ్రామ ప్రజలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.