బీఆర్ఎన్ను విమర్శించడం తప్ప అభివృధ్ధి శూన్యం మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి
పెద్దశంకరంపేట ; ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీఆర్ఎస్ నాయకులను విమర్శించడం తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు.ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమాతో ప్రజలకు నష్టం తప్ప లాభం లేదన్నారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి కలిగిన ప్రతీ రైతుకు రూ.5 లక్షల భీమాను అందించారన్నారు. రైతుబంధు, రైతుభీమాను ఆపివేసి కొంత మందికే పెన్షన్లు ఇస్తున్నారని, అర్హులైన దాదాపు 155 మందికి మండలంలో పెన్షన్లు రాలేదన్నారు. గత ప్రభుత్వ హాయంలో నాలుగుసార్లు పెన్షన్లు ఇచ్చామని, రూ.200 నుండి రూ.2016 చేసిన ఘనత బీఆర్ఎస్నన్నారు. పేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని, పంట నష్టపరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, సత్యనారాయణ సురేష్ గౌడ్,దత్తు సుభాష్, అంజయ్య. రమేష్, శంకర్ గౌడ్, విఠల్ గౌడ్,మల్లేషం తదితరులున్నారు.