జిల్లా స్థాయికి ఎంపిక కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న విద్యార్థిని
చెన్నేకొత్తపల్లి మండలం, న్యామద్ధల గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఎం. మహిత నియోజకవర్గ స్థాయి వ్యాసరచన పోటీల్లో ప్రథమ స్థానం సాధించి జిల్లా స్థాయికి ఎంపికైంది. ఈ సందర్భంగా పోటీల్లో పాల్గొన్న విద్యార్థినులు మహిత, శ్రావణి, శ్రీవాణిలను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.నియోజకవర్గ స్థాయిలో ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచిన మహిత జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక కావడంతో పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం పాఠశాలకు, విద్యార్థినికి గర్వకారణమని తెలిపారు. విద్యార్థినులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు.
*సూర్య న్యూస్ రిపోర్టర్ :- మల్లెల వన్నూరుస్వామి*