BREAKING
పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మున్సిపల్ వైస్ చైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి వేడుకగా సాగిన వైసిపి నాయకుడు బాలాజీ గృహప్రవేశం : హాజరైన వైకాపా సమన్వయకర్త నిస్సార్ అహ్మద్,నాయకులు జిల్లా స్థాయికి ఎంపిక కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న విద్యార్థిని ప్రజలకు సేవచేసే అవకాశం లభించడం గొప్ప గౌరవం : రామాచార్లపల్లి-1,బసినికొండ ఎంపిటిసిలు ఎన్.శారద,పి.నాగరాణిలు వెల్లడి సాంస్కృతిక ప్రదర్శనలతో ఘనంగా ముగిసిన ఆర్డీటీ బాలల హక్కుల వారోత్సవాలు.. శ్రీవారి ఆలయంలో నేడు కైశికద్వాదశి ఆస్థానం..మాడవీధుల్లో ఊరేగనున్న ఉగ్రశ్రీనివాసమూర్తి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో సామాజిక సమ్మిళిత అధ్యయన కేంద్రం సంచాలకుడిగా ప్రొఫెసర్ జి. వెంకట రమణ నియామకం యూజిసి నిబంధన మేరకే పి హెచ్డీ ప్రవేశాలు జనహిత సంఘం ఆవిర్భావం.. సమాజ శ్రేయస్సే లక్ష్యం.. రాజకీయ పార్టీలకతీతంగా ప్రజాసేవకు కృషి చేస్తాం.. రాష్ట్ర అధ్యక్షుడు కురుగుంట మనోహర్ రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు సిద్దరాంపురం విద్యార్థుల ఎంపిక.. ఘనంగా గ్రంథాలయాల 59వ వారోత్సవాల ముగింపు వేడుకలు స్విమ్మింగ్‌లో అనంతలక్ష్మి విద్యార్థుల సత్తా.. రాష్ట్రస్థాయికి 8 మంది ఎంపిక నల్లమాడ సర్పంచ్ గా గెలిపిస్తే...పంచాయతీ రూపురేఖలు మారుస్తా... దాసరి సూర్యనారాయణ రెడ్డి అల్లా దయతో ఆదరించండి :సర్పంచ్ అభ్యర్థులు భూ భారతి, భూముల రీ సర్వేపై రైతులకు అవగాహన కల్పించాలి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

సాంస్కృతిక ప్రదర్శనలతో ఘనంగా ముగిసిన ఆర్డీటీ బాలల హక్కుల వారోత్సవాలు..

Select Suryaa Now
సాంస్కృతిక ప్రదర్శనలతో ఘనంగా ముగిసిన ఆర్డీటీ బాలల హక్కుల వారోత్సవాలు..

అనంతపురం మేజర్ న్యూస్ ప్రతినిధి:-రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల సమ్మిళిత బాలల హక్కుల వారోత్సవాలు శుక్రవారం ఆర్డీటీ హైస్కూల్ ఫర్ ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ ప్రాంగణంలో ఘనంగా ముగిశాయి.
నవంబర్ 19, 20 తేదీల్లో జరిగిన ఈ వేడుకల్లో సుమారు 500 మంది విద్యార్థులు, 100 మంది ఆర్డీటీ సిబ్బంది పాల్గొన్నారు. మొదటి రోజు అనంతపురం స్పోర్ట్స్ విలేజ్‌లో క్రీడా పోటీలు నిర్వహించగా, రెండో రోజు చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు, ఆటలు, ఆడియో-విజువల్ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు చల్లా మధుసూదన్ రావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సివిల్ జడ్జి రాజశేఖర్, ఆర్డీటీ చైర్‌పర్సన్ డాక్టర్ హరినారాయణ రావు, డైరెక్టర్లు విషా ఫెర్రర్, కె.ఎం. రఫీక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విషా ఫెర్రర్ మాట్లాడుతూ.. ప్రతి చిన్నారిలో ప్రత్యేక ప్రతిభ ఉంటుందని, వారందరికీ సమాన అవకాశాలు కల్పించడమే నిజమైన సమ్మిళితత్వమని తెలిపారు. పిల్లలకు సురక్షితమైన, ప్రోత్సాహకరమైన వాతావరణం కల్పిస్తే వారు ఉన్నత లక్ష్యాలను సాధించగలరన్నారు.
మరోవైపు నవంబర్ 14 నుంచి 20 వరకు 39 గ్రామాల్లో నిర్వహించిన బాలల హక్కుల అవగాహన కార్యక్రమాల్లో 3,000 మందికి పైగా చిన్నారులు పాల్గొన్నారు. బాలల హక్కులు, బాధ్యతలతో పాటు పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యతలపై అవగాహన కల్పించారు.

 మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..