జనహిత సంఘం ఆవిర్భావం.. సమాజ శ్రేయస్సే లక్ష్యం.. రాజకీయ పార్టీలకతీతంగా ప్రజాసేవకు కృషి చేస్తాం.. రాష్ట్ర అధ్యక్షుడు కురుగుంట మనోహర్
అనంతపురం మేజర్ న్యూస్ ప్రతినిధి:-అనంతపురం నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం జనహిత సంఘం, అనుబంధ విభాగాలైన జన విద్యార్థి సంఘం, జన యువజన సంఘం, జన రైతు సంఘం ఆవిర్భావ సభ రాష్ట్ర అధ్యక్షుడు కురుగుంట మనోహర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రజా, కుల, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు హాజరై మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలకతీతంగా సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సంఘం పనిచేస్తుందన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి పోరాడతామని తెలిపారు.
విద్య, వైద్యం, ఉపాధి, రాజ్యాంగ హక్కులపై అవగాహన కార్యక్రమాలతో పాటు రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు, పేద విద్యార్థులకు సహాయం వంటి సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంఘం కమిటీలను బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీతో పాటు అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సాకే హరి, వాల్మీకి హరి, కేశవ నాయక్, న్యాయవాది సూర్యచంద్ర, అమర్ యాదవ్, కుళ్లాయి స్వామి, నరేంద్ర, మంత్రి సుదర్శన్, భీమేష్, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్